రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాండ్ వాయిద్యాల మధ్య ఘన స్వాగతం లభించింది. సోమవారం హైదరాబాద్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయంకి చేరుకున్న మంత్రికి విమానాశ్రయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గమున తిరుమలకు బయలుదేరి వెళ్ళారు.