శ్రీకాళహస్తి: తొండమాన్ పురంలో ఏకాదశి వేడుకలు

52చూసినవారు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమాన్ పురంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత అభయ వెంకటేశ్వర స్వామిని భక్తులు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ధనుర్మాస పూజ, బాల భోగము, శుక్రవారం సందర్భంగా ఏకాంత అభిషేకం, వెండి పుష్పాలతో విశేష పూజలు చేయడం జరిగిందని ఆలయ అర్చకులు రమణాచార్యులు తెలిపారు. భక్తులు స్వామి వారిని ఏడు ద్వారాలు గుండా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్