శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడులో ఉన్న షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి పాలు పెరుగు తేనె వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామివారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.