రామచంద్రాపురం మండలంలో వైసీపీకి రోజు రోజుకు బలం మరింత పెరుగుతోంది. టీడీపీ నుంచి తరలివచ్చే వలసల జోరు ఊపందుకుంది. గురువారం మండలంలోని కేకే పురం పంచాయతీ పరిధిలోని 9కుటుంబాలు తిరుపతి రూరల్ తుమ్మలగుంటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు.