
బి. కొత్తకోట: నేటి నుంచి హార్స్ హిల్స్ లో ఏనుగు మల్లమ్మ జాతర
బి. కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్స్ హిల్స్ లో వెలసిన ఏనుగుమల్లమ్మ జాతర మహోత్సవం నేటి నుంచి మూడురోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం సుప్రభాత సేవతో మొదలై గణపతిపూజ, కంకణధారణ, మహామంగళహారతి అనంతరం సాయంత్రం 6 గంటలకు అశ్వవాహనంపై అమ్మవారిని ఊరేగిస్తారు. రాత్రికి చెక్కభజనలు ఏనుగుమల్లమ్మ అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.