తిరుపతి: బాధితులకు డబ్బు ఇచ్చి ప్రభుత్వంపై విమర్శలు

54చూసినవారు
ప్రభుత్వం గురించి చెడుగా చెప్పాలని తిరుపతి తొక్కిసలాట బాధితులకు వైసీపీ నేతలు డబ్బు కవర్లు ఇచ్చారని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం తిరుపతిలో ఆరోపించారు. ఆ నాయకులకు సిగ్గు అనిపించట్లేదా అని మండిపడ్డారు. బాధితులు బాధల్లో ఉంటే పరామర్శ పేరుతో సీఎంపై అసత్య ఆరోపణలు చేయండని చెబుతారా అని ప్రశ్నించారు. జగన్ దుష్ట చతుష్టయమే తిరుమల పవిత్రతను మంటగలిపి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్