విద్యుత్ షాక్ తగిలి రెండు గేదెలు మృతి

72చూసినవారు
విద్యుత్ షాక్ తగిలి రెండు గేదెలు మృతి
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లిలో మేతకు వెళ్లిన రెండు గేదెలు విద్యుత్ షాక్ తో గురువారం మృతిచెందాయి. గ్రామానికి చెందిన మాలకొండయ్య అనే రైతుకు చెందిన గేదెలను పొలాల్లో మేతకు తీసుకెళ్లాడు. అక్కడ 11 కే. వి విద్యుత్ లైన్ తీగలు తెగి కిందపడి ఉన్నాయి. ఆ తీగలను తగలడంతో అక్కడికక్కడే గేదెలు మృతి చెందాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు గేదెలు విలువ రూ. లక్ష నలభై వేలు ఉంటుందని తెలిపాడు.

సంబంధిత పోస్ట్