రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15వ తేది నాటికి అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం వెంకటగిరికి విచ్చేసిన ఆయన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి అన్న క్యాంటీన్ పనులకు పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణా తోపాటు అధికారులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.