వెంకటగిరి: గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

51చూసినవారు
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం దీపం -2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎమ్మెల్యే రామకృష్ణ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారన్నారు. ఈ దీపం పథకంతో మహిళలు ఎంతో సంతోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ భానుప్రియ, ఎంపీపీ తనుజ, అధికారులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్