ఈ ఏడాది జమ్మూ కశ్మీర్‌లో 75 మంది ఉగ్రవాదులు హతం

84చూసినవారు
ఈ ఏడాది జమ్మూ కశ్మీర్‌లో 75 మంది ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్‌లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. కానీ జమ్మూ కశ్మీర్‌లో కాల్పుల మోత మాత్రం ఆగడం లేదు. జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 75 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని ఆర్మీ ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ హతమైన ఉగ్రవాదుల్లో 60 శాతం మంది విదేశీయులని ఆర్మీ అధికారులు వివరించారు.

సంబంధిత పోస్ట్