గుంటూరు, విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్రం ఇప్పటికే రూ.2 వేల కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్కు ధీటుగా జంట నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిసి గ్రేటర్ గుంటూరుగా అవతరించనుంది. అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.