ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో డయేరియా లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. శాంతినగర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న సట్టు శివన్నారాయణ (38) వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిల్లకల్లుకు చెందిన తోట వెంకటేశ్వర్లు (75) కూడా వాంతులు, విరేచనాలతో నీరసించిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.