వరద బాధితుల కోసం రామభద్రపురం మండలం నాయుడువలస ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులు పెద్ద మనసుతో స్పందించారు. వారు దాచుకున్న పాకెట్ మనీతో పాటు మరికొంత మొత్తాన్ని రూ. 5030లు సేకరించారు. తమవంతు సాయం అంటూ మంగళవారం ఎమ్మెల్యే బేబీ నాయనకు కోటలో అందించారు. విద్యార్థులను ఎమ్మెల్యే నాయనతో పాటు తదితర నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జెసి రాజు ఉన్నారు.