మహిళా భద్రతకు అధిక ప్రాదాన్యత ఇస్తున్నామని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు తెలిపారు. కొండకెంగువలో ఎస్ఐ వెలమల ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షనే ధ్యేయంగా గ్రామస్తులు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగంపై నిఘా ఉంచామని, గ్రామాల్లో గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.