కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఎం. విద్యాసాగర్ (వినయ్) ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలను బుధవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.