సెప్టెంబర్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు

76చూసినవారు
సెప్టెంబర్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు
సెప్టెంబర్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రామభద్రపురం తహసీల్దార్ ఆకుల సులోచనారాణి తెలిపారు. ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ మండలంలో 32 రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సదస్సుల్లో రీసర్వేలో వచ్చిన తప్పులను సరిచేయడం, పాసుపుస్తకాల్లో వచ్చిన వివిధ సమస్యలపై చర్చిస్తామన్నారు. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్