గరివిడి మండలంలోని కోనూరులో అక్రమ క్వారీ తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే నిరాటకంగా గ్రావెల్ తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోనూరు విఆర్ కి ఫిర్యాదు చేసిన స్పందించలేదని సర్పంచ్ బూడి శ్రీరాములునాయుడు ఆక్షేపించారు. మంగళవారం సర్పంచ్ శ్రీరాములునాయుడు గరివిడి తహశీల్దార్ చింత బంగార్రాజుకి ఫిర్యాదు చేశారు.