గజపతినగరంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బుధవారం కాంట్రాక్ట్ స్టాప్ నర్సులు నిరసన కార్యక్రమం 9వ రోజు కొనసాగింది. ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో 115 తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.