గజపతినగరం: 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 104 సిబ్బంది శుక్రవారం ఉప తహశీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ లకు వినతిపత్రాలు అందజేశారు. గత మూడు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నామని తెలిపారు. వేతనాలు సకాలంలో చెల్లించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని 104 డ్రైవర్ ఆర్. శంకరరావు, డి. ఈ. ఓ సంతోష్ కోరారు.