చల్లబడిన వాతావరణం

1109చూసినవారు
ఎస్. కోట మండలంలో శనివారం వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై, చిన్నపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉష్ణ తాపానికి గురై ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వడగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజానీకం వాతావరణం చల్లబడటంతో పాటుగా సన్నని గాలులు వీయడంతో వేసవి తాపం నుండి ఉపశమనం పొందుతున్నారు. మే నెల ముగుస్తున్న నేపథ్యంలో వర్షాలు పడతాయని ఆశాభావాన్ని రైతులు, ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్