విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని 826 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో 2024 సెప్టెంబర్ 28న, ఇందిరా ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించబడ్డాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా, మహాలయపక్షం కావున వారు తమ పితృదేవతలను స్మరించుకుని ఆలయ అర్చకులకు స్వయంపాకాలు అందజేశారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కూడా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.