బొబ్బిలి పట్టణంలోని పలు ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉండటంతో అవి అసాంఘిక శక్తులకు అడ్డాగా తయారయ్యాయి. పట్టణంలోని పోలీసు స్టేషన్ పక్కన ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం భవనం శిథిలావస్థకు చేరింది. అల్లరి మూకలు చేరి నానా రచ్చ చేస్తున్నారు. వసతి గృహాన్ని గత పదేళ్ల క్రితం మూసివేశారు. శిథిలావస్థకు చేరిన భవనంలో మందు బాబులు మద్యం తాగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.