బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బేబీ నాయన ఆదివారం లోకల్ యాప్ ప్రేక్షకులకు, వీక్షకులకు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ఉన్న రాజుల అభిమానులు, కూటమి నాయకులు, ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేసి సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.