బొబ్బిలి ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం జరిగింది. రామభద్రపురం మండలంలోని కొట్టక్కి గ్రామంలో 65 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి ఎకరం భూమి చొప్పున పట్టాలు ఇచ్చారని, ఆ భూములను సాలూరు పట్టణానికి చెందిన నాగరాజు, బాలమ్మ కుటుంబాలు దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.