బొబ్బిలి: బజారు లో వైన్ షాప్ నిర్వహించవద్దంటూ మహిళలు నిరసన

60చూసినవారు
బొబ్బిలి పట్టణంలోని ప్రధాన మార్కెట్ ప్రాంతంలోని మేదర బంద జంక్షన్ వద్ద వైన్ షాప్ నిర్వహించవద్దంటూ మహిళలు నిరసన తెలిపారు. మద్యం షాపు నిర్వహించడానికి ఎవరు ఎన్. ఓ. సీ ఇచ్చారని మహిళలు ప్రశ్నించారు. జనావాసాల మధ్య మద్యం షాపు పెట్టినట్లయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. వైన్ షాప్ పెట్టొద్దని వారంతా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్