May 15, 2024, 09:05 IST/ఖానాపూర్
ఖానాపూర్
టిఏ, డిఏలు చెల్లించాలి
May 15, 2024, 09:05 IST
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించిన ఆశా వర్కర్లకు ఎలక్షన్ టిఏ, డిఏలు ఇవ్వాలని సిఐటియు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సురేష్ కోరారు. ఈ మేరకు సిఐటియు, ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు బుధవారం మధ్యాహ్నం కడెం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో స్థానిక తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఆశ వర్కర్లకు ఎలక్షన్ డ్యూటీలు ఇతర ప్రాంతాల్లో వేశారని, వారికి టిఎ, డిఎలు ఇవ్వాలన్నారు.