చీపురుపల్లి మండలం పురేయవలసలో స్వయంభుగా వెలసిన శ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మవారి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.