చీపురుపల్లి పట్టణంలో వున్న పేద ప్రజలకు పనులు లేక నిరాదరణకు కోల్పోయిన కుటుంబాలకు.. అలాగే ఒంటరిగా వున్న. మహిళలకు 6 కేజీలు చొప్పున 25 మంది కుటుంబాలకు బియ్యం కూరగాయలను ఆశయ యూత్ అసోషియేషన్ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆశయ యూత్ అసోషియేషన్ అధ్యక్షులు రెడ్డి రమణ మాట్లాడుతూ.. గత సంవత్సరం నుండి కరోనా కారణంగా చాలా కుటుంబాలు పేదరికం లో వున్నాయని ఇంతవరకు దాతల సహాకారంతో పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసామని..మాకు సహాకరించిన ధాతలకు ప్రత్యేక ధన్యవాదాలు అన్ని ఇంకా సహాకారిస్తే ఎక్కువ మందికి అందజేస్తామని అన్నారు.