చీపురుపల్లి పరిధిలో హిందూస్తాన్ సౌట్స్ గెడ్స్ వారి సహాకారంతో ఆశయ యూత్ అసోషియేషన్. డాక్టర్ ప్రభాకర్ హోమియో సహాయంతో వ్యాధినిరోధక శక్తిని పెంచే మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులు ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి. రమణ మాట్లాడుతూ కరోనాపై ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ప్రతి ఒకరు సామాజిక దూరం పాటించాలని అలాగే ప్రతి ఒకరు మాస్కులు ధరించాలన్నారు. హోమియో మందులు వల్ల మనిషి రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్ని ప్రతి ఒకరు మూడు రోజుల పాటు వేసుకోవాలని చేతులు శుభ్రంత పాటించాలని అలాగే కరోనా రోగుల పట్ల విపక్షత గురి చేయకుడదని మనం పోరాడవల్సింది రోగితో కాదని వ్యాధితో అని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూస్తాన్ సౌట్స్ గెడ్స్ శ్రీనువాసు చౌదరి, రామకృష్ణ, మురళి, డి.శ్రీను, గ్రామస్థులు మజ్జి.శంకరరావు పాల్గొన్నారు.