పోషకాలు సంవృద్దిగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి

785చూసినవారు
పోషకాలు సంవృద్దిగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి
పోషకాలు సంవద్దిగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలాని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షకురాలు తాడ్డి శ్రీదేవి అన్నారు. శుక్రవారం విజయనగరం మెరకముడిదాం మండలంలో గల సింగవరం లో గర్భాం సెక్టార్ పర్యవేక్షకురాలు శ్రీదేవి ఆద్వర్యంలో రాష్ట్రీయ పోషన్ అభియాన్ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తమ ఆహర అలవాట్లు మార్చుకోవాలన్నారు. పాలిష్ చేసిన బియ్యం కాకుండా పూర్వకాలంలా ముడి బియ్యం అన్నం మాత్రమే తినాలి అన్నారు. తాము తీసుకుంటున్న ఆహారంలో పోషకాలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే గర్భిణీలకు, భాలింతలకు పౌష్టికాహారం పై అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు జి నాణి, పి ఆదిలక్ష్మి గౌరమ్మలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్