జీవో నెంబర్ 7 ద్వారా తమకు వేతనాలను చెల్లించాలని గుర్ల 108 సిబ్బంది శనివారం అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈనెల 25 నుండి సమ్మెలోకి దిగుతామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు వినతిపత్రం ఇస్తున్నామని, ఇందులో భాగంగా చింతలపేట సర్పంచ్ పతివాడ భాస్కర్ కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.