మెరకముడిదాంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

249చూసినవారు
మెరకముడిదాంలో  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాం మండలంలో  సోమవారం 75వ  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అభివృద్ధి కార్యాలయం, తహశీల్దారు కార్యాలయంలలో ఎంపిపి తాడ్డి కృష్ణవేణి పతాకావిష్కరణ గావించారు. బుదరాయవలస పోలీస్ స్టేషన్ లో ఎస్సై నవీన్ పడాల్ , గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆయా పాఠశాల అభివృద్ధి కమిటి అధ్యక్షులు పతాక ఆవష్కరణ  గావించారు. అనంతరం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిపి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాలను గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రామకృష్ణ, తహశీల్దారు రత్నాకర్, పలువురు నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్