మనిషి జీవితం ఎంతో విలువైనది: ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ

234చూసినవారు
మనిషి జీవితం ఎంతో విలువైనది: ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ
జి.అగ్రహారం ప్రజా గ్రంథాలయం అవరణంలో ఆశయ యూత్ అసోషియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ జీవితం విలువలు తెలుసుకోవాలని, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం వుంటుందని గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవలని అన్నారు. మనిషిగా పుట్టడం ఓ అదృష్టంగా భావించాలని, ఏ ప్రాణికీ లేని తెలివితేటలు మంచి చెడులు ఆలోచించే వివేకం మనకే సొంతమని, ఎంతో విలువైన ఈ జీవితాన్ని క్షణికావేశంలో కొందరు కోల్పోతున్నారని అన్నారు. ధర్మ సిధ్ధాతాలు పాటించాలని ఆత్మహత్యలు చేసుకోవటం నేరమని సూచించారు. సృష్టిలో సమస్యలు లేని జీవి ఏది వుండదు.. ప్రతి సమస్యకు పరిష్కారం కుడా మన దగ్గర వుంటుంది. సమస్యకు పరిష్కారం అలోచించలే తప్ప ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు అని జీవితం చాలా విలువైనది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆశయ సంస్థ సభ్యులు డి. శ్రీను గ్రంథాలయం పాఠకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్