మందిరివలసలో మొబైల్ బైక్ లైబ్రరీ

239చూసినవారు
మందిరివలసలో మొబైల్ బైక్ లైబ్రరీ
విజయనగరం జిల్లా గరివిడి మండలం మందిరివలస గ్రామంలో పర్యటన ఆశయ యూత్ అసోషియేషన్ మరియు ఆశయ రూరల్ లైబ్రరీ వారి ఆధ్వర్యంలో జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు సందర్భంగా విద్యార్థులు యువత వున్న దగ్గరకు వెళ్లి వారికి పుస్తక పఠనం పై స్పందించారు అవగాహన కల్పించారు.

ప్రస్తుత వున్న పరిస్థితి లో విద్యార్థులలో పుస్తక పఠనం తగ్గిపోతుంది అని వారిలో పుస్తక పఠనం పెంపొందించడానికి వినూత్నమైన ఆలోచన తో *మొబైల్ బైక్ లైబ్రరీ ని ప్రారంభించాం అని అ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ అన్నారు. అలాగే గత నెల ప్రారంభం అయిన ఈ కార్యక్రమాం నేటి వరకు 600 కిలోమీటర్లు 33 గ్రామాల్లో పర్యటన చేయడం జరిగిందని.. అలాగే 2200 మంది పుస్తక పఠనం చేసారు అని ఈ కార్యక్రమం గురించి వివరించడం జరిగింది అని ఈ మొబైల్ బైక్ లైబ్రరీ లో విద్యార్థులకు నీతి కధలు, స్వామి వివేకానంద పుస్తకాలు,జీవన నైపుణ్యాలు, పుస్తకాలు,యువత కు కావల్సిన పుస్తకాలు పెద్దలకు, అన్ని తరగతులు వారికి కావల్సిన పుస్తకాలు అందుబాటులో వున్నాయని, ప్రస్తుత కోవిద్ కారణంగా విద్యార్థులు ఇంటి దగ్గర వుండడం వల్లన మొబైల్ పోన్లు పెరిగిపోతోంది అని అవి వాడకం తగ్గించి పుస్తకాలు చదవాలని, తద్వారా మేధోశక్తి పెంచుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో లెక్చరర్ మహంతి ఉమామహేశ్వరరావు, సతీష్, త్రినాథరావు,మాదవరావు గ్రామ పెద్దలు యువత విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్