చీపురుపల్లి మండలంలో విజ్ఞాన్ పాఠశాలలో శనివారం నో బ్యాగ్ డే సందర్బంగా అమ్మకు వందనం కార్యక్రమం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమం లో
విద్యార్థులు తమ తల్లికి పూలమాల వేసి కాళ్ళు కడిగి ఆనీటిని తలపై జల్లుకొన్నారు.ఆదిగురువు అమ్మ అని అమ్మకు మించిన దైవం మరొకటి ఈ సృష్టి లో లేదని అందరు అమ్మని గౌరవించాలని, చిన్ననాటి నుండే ఇటువంటి విషయాలు
విద్యార్థులు నేర్చుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి విద్యార్థులకి తెలిపారు.