భగత్ సింగ్ కు ఘన నివాళులు

160చూసినవారు
భగత్ సింగ్ కు ఘన నివాళులు
What: *దేశం కొసం ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్ ను యువత స్పూర్తిగా తీసుకోవాలని ఆశయ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి రమణ పేర్కొన్నారు. చీపురుపల్లి జి.అగ్రహారం ప్రజా గ్రంథాలయం అవరణంలో ఆశయ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో విప్లవ విరుడు స్వాతంత్ర్య సమర యేదుడు భగత్ సింగ్ 114 జయంతి వేడుకలు నిర్వహించారు. ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ మాట్లాడుతూ ఆయన 12 యేళ్ళ వయసులో ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిందన్నారు. ఆ సంఘటన ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. ఆ ప్రదేశానికి వెళ్ళి భూమిని ముద్దాడి, అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఇంటికి తీసుకు వచ్చారు. ఈ ఒక్కటి చాలు ఆయన ఎంత దేశ భక్తుడో చెప్పడానికి అన్నారు. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ సభ్యులు ఆర్.మురళి, డి. శ్రీను, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్