కోట్ల మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలను టిడిపి దెబ్బతీస్తోందని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. చీపురుపల్లి మండల కేంద్రంలో శనివారం ఆయన స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డూ విషయంలో టిడిపి విష ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి నాయకులు పాల్గొన్నారు.