విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో గల పెదమంత్రిపేట, గర్భాం కొత్తవీధి అంగన్‌వాడీ కేంద్రాల నూతన భవనాలు ప్రారంభించడంతో పాటు తో పాటు బైరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు భవనాలకు జిల్లా పరిషత్ అధ్యక్షులు చిన్న శ్రీను బుదవారం శంకుస్థాపన చేసారు. ముందుగా గర్భం మోడల్ స్కూల్ లో వంటసామగ్రి మరియు విద్యార్థులకు స్టడీ టేబుల్స్ పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాడ్డి కృష్ణవేణి , తాడ్డి వేణుగోపాలరావు, వెంకటరావు, బుర్లె నరేష్ , సర్పంచ్లు , ఎంపీటీసీలు , ఐసిడిఎస్ సిడిపిఒ రాజేశ్వరి, పర్యవేక్షకులు శ్రీదేవి, కృష్ణ వేణి, కరుణ, మంగ నోడల్ ఆఫీసర్ తవిటినాయుడు, మండల అధికారులు, స్థానికలు తదితరులు పాల్గొన్నారు.