సర్వ మంగళాదేవిగా రాజమ్మతల్లి దర్శనం

78చూసినవారు
సర్వ మంగళాదేవిగా రాజమ్మతల్లి దర్శనం
బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభుగా వెలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో భాద్రపద బహుళదశమి శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారు భక్తులకు సర్వ మంగళాదేవిగా గాజుల అలంకరణలో దర్శనమిచ్చారు. హైదరాబాద్ చెందిన అన్నం గిరిధర్, జయంతి దంపతుల ఆర్థిక సహాయంతో అమ్మవారికి గాజుల అలంకరణ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అర్చకులు దూసి శ్రీధర్ శర్మ ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.

సంబంధిత పోస్ట్