విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని చౌదంతివలసలో గల మహా కామేశ్వరి అమ్మవారి ఆలయాన్ని.. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల లాంఛనాలతో ఆహ్వానం పలికారు. అక్కడ నాయకులు అధికారులతో మాట్లాడి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.