రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కోరారు. బుధవారం దత్తిరాజేరు మండలం పోరలి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం అమ్మకాలు చేసిన రైతుల బ్యాంకు ఖాతాలో 48 గంటలలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. గత ప్రభుత్వంలో రైతు దగా పడ్డాడని మండిపడ్డారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.