గజపతినగరంలోని శ్రీరామక్షేత్రం జంక్షన్ లో గల కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి గురువారం తిరుప్పావడ (అన్న కూటోత్సవం) సేవ వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు గురువారం విశేష పూజలు నిర్వహించారు. అన్న కూటోత్సవం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు.