గంట్యాడ మండలం కొండ తామరపల్లి జంక్షన్ లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విజయనగరానికి చెందిన ఎన్ వీ రమణ (50) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అనంతగిరిలో హెడ్ కానిస్టేబుల గా పనిచేస్తున్న రమణ విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా. విజయనగరం నుంచి అనంతగిరి వెళ్తున్న గురునాథ్ రెడ్డి బైక్ ఢీ కొట్టుకున్నాయి. ఘటనలో గురునాథ్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.