గంట్యాడ మండలంలోని కొండ తామరాపల్లి జంక్షన్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎస్పీ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ ఎన్ వి రమణ అక్కడికక్కడే మృతి చెందారు. మరో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనాలపై వేరుగా వస్తున్న వారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. విజయనగరం సిఐ లక్ష్మణరావు గంట్యాడ ఎస్. ఐ సాయి కృష్ణ పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.