భారీ వైద్య శిబిరం నిర్వహణ.

425చూసినవారు
భారీ వైద్య శిబిరం నిర్వహణ.
గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామం బిసి కోలనీలో సోమవారం టీడీపీ మాజీఎంపిటిసి కరుమజ్జికృష్ణ, టీడీపీ నాయకులు పొట్నూరు అప్పలస్వామి, పొట్నూరు నారాయణరావు, గ్రామ టిడిపి అధ్యక్షులు మంత్రి శ్రీ రామ, మిమ్స్ హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ కృష్ణ మరియు వైద్యులు ఆధ్వర్యంలో భారీ వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 150 మంది కి జనరల్ ఓపీ చూసి, హెల్త్ చెకప్ చేశారు. ఆస్తమాలజీ, ఆర్థోపెడిక్ , జనరల్ సర్జన్, ఈఎన్ టి స్పెషలిస్టులు చే తనిఖీ చేయడం జరిగింది. అందులో 25 మందికి కంటి పరీక్షలు చేసి కంటి ఆపరేషన్ కి ఎంపిక చేశారు. జనరల్ ఆపరేషన్ కి ఎనిమిది మందిని ఎంపిక చేశారు వీరందరికీ ఈనెల 18వ తేదీన ఆపరేషన్ చేయడానికి హమీ ఇచ్ఛారు. మిగతా వారందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మిమ్స్ఆసుపత్రి వైద్య సిబ్బంది టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్