దత్తిరాజేరు మండలంలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్

72చూసినవారు
దత్తిరాజేరు మండలంలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్
దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస పిహెచ్సిలో వైద్యాధికారులు స్రవంతి, రఘు ఆధ్వర్యంలో సోమవారం ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 45 మంది గర్భిణీ స్త్రీలకు గైనకాలజిస్ట్ పద్మ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్తహీనత పై అవగాహన కల్పించారు. పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. హెల్త్ ఎడ్యుకేటర్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్