రామభద్రపురం మండలంలోని ఆరికతోట వద్ద సోమవారం లారీని ఢీకొన్న ఆర్టీసీ ఢీకొన్న ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న బొండపల్లి మండలం గరుడబిల్లికి చెందిన రెడ్డి మహాలక్ష్మికి తీవ్రగాయాలు కాగా మరికొంత మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా మహాలక్ష్మి రెండు కాళ్లు ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు పూర్తిగా నుజ్జు అయింది. బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది.