May 12, 2024, 16:05 IST/నిర్మల్
నిర్మల్
పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
May 12, 2024, 16:05 IST
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఆదివారం పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం నిర్మల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆయన సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది సకాలంలో వారికా కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. పొలింగ్ సామాగ్రి పంపిణీ సరళిని పరిశీలించారు.