సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని నిర్మల్లో చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. సమ్మెకు ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పరిష్కరించి హమాలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో విలాస్, రాథోడ్ పుండలిక్, సాయి, రమేష్, బలరాం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.