తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై శాసన మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి TGPSC ద్వారా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షల నిర్వహాణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని అన్నారు.